News February 10, 2025

అనంతపురంలో భారీ చోరీ.. ధార్ గ్యాంగ్‌ అరెస్ట్

image

అనంతపురం శ్రీనగర్ శివారు కాలనీలో 18 రోజుల క్రితం జరిగిన భారీ చోరీ కేసును ఛేదించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు సభ్యుల ధార్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 59 తులాల ఆభరణాలు, రూ.19.35లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడిపై పలు రాష్ట్రాల్లో 32 కేసులు ఉన్నాయని తెలిపారు.

Similar News

News February 11, 2025

ఆనంతపురం పోలీసుల ప్రజా దర్బార్‌కు 57 పిటీషన్లు

image

అనంతపురం పోలీసుల ప్రజా దర్బార్‌కు 57 పిటీషన్లు వచ్చినట్లు అదనపు ఎస్పీ డి.వి. రమణమూర్తి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజల నుంచి సోమవారం ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులు పంపి ఆదేశాలు జారీ చేశారు.

News February 10, 2025

రాప్తాడు వైసీపీలో ముసలం

image

రాప్తాడు వైసీపీలో ముసలం నెలకొంది. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాధవ్ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడంపై తోపుదుర్తి వర్గీయులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఇటీవల ఐదుగురు వైసీపీ నేతలను తోపుదుర్తి సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో తోపుదుర్తిని వ్యతిరేకిస్తూ రామగిరి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కలకలం రేపింది.

error: Content is protected !!