News February 10, 2025
భద్రాద్రి: 50 ఏళ్లుగా మోటారు లేకున్నా నీటి సదుపాయం

భద్రాద్రి జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామంలో వేసిన బోరులో భగీరథుడే ఉన్నట్లు నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. ఊరిలో నీళ్ల కరవుందని 50 ఏళ్ల కింద బోరు వేశారు.. మోటారు బిగిద్దామనుకుంటే నీళ్లు ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు. తమ తాతల కాలం నుంచి నీళ్లు పైకి వస్తున్నాయని అంటున్నారు. పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ నీళ్లనే వాడుకుంటున్నారు.
Similar News
News January 13, 2026
RR: వారికి రేషన్ డీలర్ కట్ చేస్తాం: మాచన

రంగారెడ్డి జిల్లాలోని కొందరు రేషన్ డీలర్లు సర్పంచ్‌లుగా పోటీ చేసి గెలుపొందారని ఇది గొప్ప పరిణామమని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. కానీ సర్పంచ్‌లు అయ్యాక డీలర్‌గా కొనసాగటం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ చేసిన డీలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే డీలర్ షిప్ రద్దుకు సిఫారసు చేస్తామన్నారు.
News January 13, 2026
గ్రామీణ విద్యకు అంతర్జాతీయ ప్రమాణాలు: డిప్యూటీ CM భట్టి

2027–28 విద్యా సంవత్సరం నాటికి యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
News January 13, 2026
గర్భిణులు నువ్వులు తినకూడదా?

పండుగ పిండివంటల్లో ఎక్కువగా నువ్వులను వాడుతుంటారు. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్, విటమిన్లు అనేక అనారోగ్యాలకు చెక్ పెడతాయి. అయితే గర్భిణులు మాత్రం నువ్వులు తినకూడదని చాలామంది చెబుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే గర్భిణులు నువ్వులు తినడం వల్ల గర్భాధారణ సమయంలో తల్లికి అవసరం అయ్యే పోషకాలు, క్యాల్షియం, విటమిన్స్, అమినోయాసిడ్స్, ప్రోటీన్స్, ఐరన్ పుష్కలంగా అందుతాయి. కానీ చాలా మితంగా తీసుకోవాలి.


