News February 10, 2025

అగాఖాన్ అంత్యక్రియలు పూర్తి

image

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇస్మాయిలీ ముస్లింల 49వ ఇమామ్ అగాఖాన్(88) అంత్యక్రియలు ముగిశాయి. ఈనెల 5న మరణించిన ఆయనను ఈజిప్ట్‌లోని అస్వాన్‌లో నిన్న రాత్రి ఖననం చేశారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఆయన 1967లో అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌ను స్థాపించారు. దీని ద్వారా వందలాది ఆసుపత్రులు, పాఠశాలలు, పేదలకు ఇళ్లు నిర్మించారు. ఆయన సేవలకుగానూ 2015లో కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

Similar News

News February 11, 2025

నాలుగు లేన్లుగా కరకట్ట రోడ్డు!

image

AP: విజయవాడ నుంచి రాజధాని అమరావతి వెళ్లేందుకు ప్రస్తుతమున్న కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. దాదాపు అలైన్‌మెంట్ పూర్తి కాగా త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం భూసేకరణ/భూసమీకరణ చేయాలా? అనే దానిపై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా నది వరదలను తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేయనున్నారు.

News February 11, 2025

సారీ చెప్పిన హీరో.. అయినా తగ్గమంటున్న వైసీపీ ఫ్యాన్స్!

image

‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై చెలరేగిన <<15417744>>వివాదం<<>> కొనసాగుతోంది. హీరో విశ్వక్‌సేన్ సారీ చెప్పినా వైసీపీ ఫ్యాన్స్ తగ్గటం లేదు. పృథ్వీరాజ్‌తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 115K+ ట్వీట్లతో #BoycottLaila ఇంకా Xలో ట్రెండ్ అవుతోంది. మరి దీనిపై మరోసారి మూవీ టీమ్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి. ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.

News February 11, 2025

ఏపీలో అక్షరాస్యత రేటు ఎంతంటే?

image

APలో అక్షరాస్యత రేటు 67.5%గా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత మూడేళ్లలో అక్షరాస్యత రేటు పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని వైసీపీ ఎంపీ తనూజారాణి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. 2023-24లో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత 77.5%గా ఉండగా, ఏపీలో 67.5%గా ఉందన్నారు. పీఎం కౌశల్ యోజన కింద రాష్ట్రానికి రూ.48.42కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

error: Content is protected !!