News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News September 18, 2025
విజయవాడ: దసరాకు 422 ప్రత్యేక బస్సులు

దసరా, విజయవాడ ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు 422 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 12 డిపోల నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతామని పేర్కొన్నారు.
News September 18, 2025
KNR: నేటి నుంచి సదరం క్యాంపులు

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి 24వ తేదీ వరకు సదరం క్యాంపులు జరగనున్నాయని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు మీసేవ కేంద్రాల ద్వారా తమ పేరును నమోదు చేసుకొని, కేటాయించిన తేదీల్లో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హాజరుకావాలని కోరారు. మొత్తం 676 మందికి ఈ క్యాంపుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
News September 18, 2025
సాహిత్య పురస్కారాలకు ముగ్గురు కవులు ఎంపిక

ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు కవులు సాహిత్య పురస్కారాలకు ఎంపిక య్యారు. NKP మండలానికి చెందిన సాగి కమలాకరశర్మ ఇటీవల దివాకర్ల వేంకటావధాని సాహిత్య పురస్కారానికి ఎంపిక కాగా.. నల్గొండకు చెందిన ఎస్. రఘు, సూర్యాపేట జిల్లా అనంతారం గ్రామానికి చెందిన బైరెడ్డి కృష్ణారెడ్డి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల సాహిత్యకారులు హర్షం వ్యక్తం చేశారు.