News February 10, 2025

మన్యంకొండ బ్రహ్మోత్సవాలు.. స్వామివారి హంస వాహన సేవ

image

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

Similar News

News April 17, 2026

కామారెడ్డి: క్రీడా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ క్రీడా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. బీపీఈడీ, ఎంపీఈడీ, స్పోర్ట్స్ కోచింగ్, యోగా వంటి కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి గల అభ్యర్థులు www.lnipe.edu.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు.

News April 17, 2026

శబరి గారూ.. మీకు కళ్లు ఉండి చూడలేకపోతున్నారా?: MP శబరి

image

YCP హయాంలో మహిళలను అనేక రకాలుగా కించపరిచారంటూ పార్లమెంట్‌లో MP భైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. ‘ఏపీలో కూటమి నాయకుల అరాచకాలు కనిపించడం లేదా? మీకు కళ్లు ఉండి చూడలేకపోతున్నారా? మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి పదవులు కట్టబెట్టారు. జగన్ హయాంలోనే 50శాతం రిజర్వేషన్లు, డీబీటీ ద్వారా రూ.2.74 లక్షల కోట్లు అందించి నిజమైన మహిళా సాధికారత సాధించాం’ అని పేర్కొన్నారు.

News April 17, 2026

ఇండియాకు వాంటెడ్ టెర్రరిస్టులు.. పాక్‌లో హతం!

image

లష్కరే తోయిబా(LeT) కో ఫౌండర్ అమీర్ హమ్జాపై పాక్‌లో <<19664047>>కాల్పులు<<>> జరగడం తెలిసిందే. మూడేళ్లుగా LeT, జైషే(JeM), హిజ్బుల్(HM)లోని వాంటెడ్ టెర్రరిస్టులు ‘గుర్తుతెలియని వ్యక్తుల’ కాల్పుల్లో హతమవుతున్నారు. మహ్మద్ తాహిర్ అన్వర్(JeM చీఫ్ మసూద్ అజర్ అన్న), LeT టెర్రరిస్టు అబు ఖతల్(హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు), ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్‌వార్‌తో సహా ఎంతో మందిని పాక్‌లో మట్టుబెట్టారు.