News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News November 27, 2025
మంచిర్యాల: 90 సర్పంచ్, 816 వార్డు స్థానాలకు నామినేషన్

మంచిర్యాల జిల్లాలోని తొలి విడతలో 4 మండలాల్లో 90 సర్పంచ్, 816వార్డుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దండేపల్లి (M)లో 31 GPలు, 278 వార్డులు, హాజీపూర్ (M)లో 12 GPలు,106 వార్డులు, జన్నారం (M)లో 29 GPలు, 272 వార్డులు, లక్షెట్టిపేట (M)లో 18 GPలు,160 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు.
News November 27, 2025
అమలాపురంలో 29న దివ్యాంగులకు క్రీడా పోటీలు

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 29న అమలాపురం బాలయోగి స్టేడియంలో ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వైకుంఠరావు రుద్ర తెలిపారు. ఇందులో బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, వాలీబాల్ పోటీలు ఉంటాయన్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ పోటీలను అండర్-17 సబ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తామని, ఆసక్తిగల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 27, 2025
NTR: ఈ సమస్యలను పట్టించుకోండి కలెక్టర్ సాబ్..!

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీశ పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో అనేక సమస్యలు పరిష్కరించినా, ప్రధాన సమస్యలపై మాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు. ఫుడ్ కోర్ట్ నాణ్యత, తిరువూరు కిడ్నీ బాధితుల నీటి సరఫరా ఆలస్యం, ఆటోనగర్ కాలుష్యం, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి. ముఖ్యంగా టూరిజం అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


