News February 10, 2025

అనంతపురంలో భారీ చోరీ.. ధార్ గ్యాంగ్‌ అరెస్ట్

image

అనంతపురం శ్రీనగర్ శివారు కాలనీలో 18 రోజుల క్రితం జరిగిన భారీ చోరీ కేసును ఛేదించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు సభ్యుల ధార్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 59 తులాల ఆభరణాలు, రూ.19.35లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడిపై పలు రాష్ట్రాల్లో 32 కేసులు ఉన్నాయని తెలిపారు.

Similar News

News March 16, 2026

నేటి ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’: కడప కలెక్టర్

image

సోమవారం నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగు పద్ధతులపై అవగాహన, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికతపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.

News March 16, 2026

9/11 తరహా ఉగ్రదాడికి కుట్ర.. ఇరాన్ సంచలన ఆరోపణలు!

image

ఉగ్రదాడికి ఎప్‌స్టీన్ నెట్‌వర్క్ కుట్ర పన్నిందని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌లో మిగిలిన సభ్యులు USలో 9/11 తరహా ఘటనను క్రియేట్ చేసి, దానికి ఇరాన్‌ను నిందించాలని ప్లాన్ చేసినట్లు విన్నాను. మేం ఇలాంటి వాటికి వ్యతిరేకం. మా యుద్ధం US ప్రజలతో కాదు’ అని ట్వీట్ చేశారు. 2001 SEP 11న న్యూయార్క్‌ ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా చేసిన దాడిలో 3వేల మంది చనిపోయారు.

News March 16, 2026

కృష్ణా: ‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం.. జిల్లాలో 148 కేంద్రాలు

image

నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 148 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 22,232 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 148 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 148 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో పాటు 1500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు 5 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.