News February 10, 2025
ద్వారకాతిరుమల: కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య

ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఘంట సోమశేఖర్(36) కడుపు నొప్పి భరించలేక ఈనెల 5న రాత్రి కలుపు మందు తాగాడు. 6న ఉదయం ఇంట్లో చెప్పగా, భీమడోలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. భార్య అనిత ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 13, 2025
రూ.13 కోట్లతో ధ్యాన కేంద్రం: మంత్రి సీతక్క

ప్రఖ్యాత రామప్ప సరస్సులోని దీవిలో కేంద్ర నిధులతో రూ.13 కోట్లతో ధ్యాన కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 7 ఎకరాల విస్తీర్ణంలో ధ్యాన ముద్రలో ఉన్న శివుని భారీ విగ్రహంతో సహా మెడిటేషన్ సెంటర్‌ను నిర్మించే పనులను సీతక్క ప్రారంభించారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు.
News November 13, 2025
VKB: కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. వచ్చే వారం రోజులు జాగ్రత్త

వికారాబాద్ జిల్లాలో రాబోయే వారం రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో కూడిన సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గర్భిణులు, 65 ఏళ్లు పైబడిన వారు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 13, 2025
సిరిసిల్ల: కాయగూరల ధరలు పైపైకి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతు బజార్లలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గురువారం రైతు బజార్ నిర్వహించగా కాకరకాయ కేజీ రూ.80/-, బెండకాయ 89/-, చిక్కుడుకాయ 80/-, మిర్చి 50/-, వంకాయ 89/-, క్యాప్సికం 70/- కాలీఫ్లవర్ 70/-లుగా పలుకుతోంది. ఇటీవల సంభవించిన తుఫాన్ వల్ల చాలా ప్రాంతాలలో రైతులు కూరగాయల పంటలు తీవ్రంగా నష్టపోవడంతో ధరలు కొండెక్కాయి. మరి మీ ఏరియాలో కాయగూరల ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.


