News February 10, 2025

విశాఖ: నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఈరోజు ఆఖరి రోజు కాగా ఇప్పటివరకు 8మంది నామపత్రాలు సమర్పించారు. సోమవారం ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ఈనెల 11న చేస్తారు. 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Similar News

News March 15, 2026

విశాఖలో రేపు PGRS

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 15, 2026

విశాఖలో వంకాయలు రూ.28

image

విశాఖలోని 15 రైతు బజార్లలో ఆదివారం కాయగూరల ధరలు (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.8, ఉల్లిపాయలు రూ.19, కాలీఫ్లవర్ రూ.12, క్యాబేజీ రూ.12, వంకాయలు రూ.28, బెండకాయలు రూ.30, కాకరకాయలు రూ.26, క్యారెట్ రూ.28, గోరుచిక్కుడు రూ.34, బీన్స్ రూ.40, కర్ర పెండ్లం రూ.16, నిమ్మకాయలు రూ.125, గ్రీన్ పీస్ రూ.34గా ఉన్నాయి.

News March 15, 2026

ఏప్రిల్‌లో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన: ఎమ్మెల్యే గంటా

image

ఆనందపురం మండలం తర్లువాడలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్‌కు ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపన చేయనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం కొమ్మాదిలోని ఒక ప్రైవేట్ కాలేజీ రజతోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ కృషితో విశాఖ ఐటీ హబ్‌గా మారుతోందని, అమెరికా వెలుపల గూగుల్ సంస్థకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంటుందని గంటా పేర్కొన్నారు.