News February 10, 2025

నెల్లూరు: విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి

image

బాలిక(13)పై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరంలోని  ఓ పాఠశాలలో ఏడో తరగతి చదివే ఓ బాలిక రోజూ ఆటోలో స్కూల్‌కి వెళ్తోంది. స్కూల్ ఆటో నడిపే సతీశ్‌ బాలికను బీచ్‌కి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆటోడ్రైవర్ స్నేహితుడు సునీల్ కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులపై పొక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News March 15, 2026

రేపు కోటంరెడ్డి మీడియా సమావేశం

image

కొద్దికాలం విరామం అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకు రానున్నారు. నిరంతరమైన ప్రజల్లో ఉంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో మీడియా సమావేశాల్లో కాస్త తగ్గించిన అభివృద్ధి జోరు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

News March 15, 2026

నెల్లూరు: 7th క్లాస్ బాలిక..9th క్లాస్ బాలుడికి పెళ్లి

image

గుడ్లూరు మండలంలో బాల్య వివాహం జరిగింది. 7వ తరగతి చదువుతున్న బాలికకు, 9వ తరగతి చదువుతున్న బాలుడికి వాళ్ల పెద్దలు శుక్రవారం వివాహం జరిపించినట్లు సమాచారం ఒంగోలులోని స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. చట్ట విరుద్ధమైన ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవాలని సంస్థ ప్రతినిధి కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీని కోరారు. ఆయన వెంటనే జోక్యం చేసుకొని బాలికను బాలికా సదన్‌కు తరలించాలని ఆదేశించారు.

News March 15, 2026

నెల్లూరు: మహిళా కండక్టర్‌కు HIV ఉందంటూ అవమానం!

image

నెల్లూరు జిల్లాలోని గూడూరు డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ తనను వైద్యురాలు అందరిలో అవమానించి, HIV ఉందంటూ తప్పుడు ధ్రువీకరణ ఇచ్చిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ అధికారులు విచారణ జరిపి వైద్యురాలిని మందలించినట్లు తెలుస్తోంది. బాధితురాలు ల్యాబ్‌లో రక్త పరీక్షలు చేయించగా నెగటివ్ రిపోర్టు వచ్చిందని బాధితురాలు తెలిపారు.