News February 10, 2025

40 రోజుల్లో 81 మంది హతం

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఈ ఏడాదిలో గత 40 రోజుల్లో మొత్తం 81 మంది ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. గత ఏడాది 217 మంది మావోలు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న ఉదయం జరిగిన కాల్పుల్లో 31 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ప్రకటించారు.

Similar News

News April 4, 2026

సూపర్ నేపియర్ గడ్డితో పశువులకు కలిగే లాభమేంటి?

image

పచ్చి గడ్డిలో విటమిన్-A అధికంగా ఉంటుంది. సూపర్ నేపియర్ గడ్డిలో 10-12 శాతం మాంసకృత్తులు, 50-55% జీర్ణమయ్యే పదార్థాలు, 28-30 శాతం పీచుపదార్థం ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పశువులు ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాడిపశువుల్లో ఎదుగుదల, సంతానోత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.

News April 4, 2026

జుట్టు చివర్లు చిట్లుతున్నాయా..?

image

వాతావరణ మార్పుల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లడం ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానానికి మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. బయటకి వెళ్తున్నప్పుడు జుట్టంతా కప్పిఉంచుకోవాలి. తలస్నానం తర్వాత హెయిర్ సీరం వాడటం మంచిది. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయినా సమస్య తగ్గకపోతే ఒకసారి ట్రైకాలజిస్ట్‌లను సంప్రదించాలి.

News April 4, 2026

ఒరాకిల్ బాస్‌కు ₹18 లక్షల కోట్ల లాస్

image

ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎలిసన్ గత 6 నెలల్లో ఊహించని రీతిలో నష్టపోయారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆయన $393 బిలియన్లతో సంపద విషయంలో మస్క్‌నే వెనక్కి నెట్టారు. కానీ ఇప్పుడు ఆయన నెట్ వర్త్ $195 బిలియన్లకు పడిపోయింది. దాదాపు ₹18 లక్షల కోట్లు నష్టపోయారు. ఒరాకిల్ షేరు విలువ 50% పైగా కుప్పకూలడమే ఇందుకు కారణం. ఏకంగా 50% సంపద కోల్పోవడం గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద ‘డౌన్‌ఫాల్’ అని నిపుణులు అంటున్నారు.