News February 10, 2025

జగిత్యాల: ఉరేసుకుని యువతి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన సందవేని శ్రీవాణి(23) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతురాలు ధర్మారంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 10, 2026

‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై నిషేధం

image

బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్‌ కంపెనీ ‘అల్మాంట్-కిడ్’ సిరప్‌పై TG డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధం విధించింది. చిన్నారులకు ఉపయోగించే ఈ సిరప్‌లో విషపూరితమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగం ప్రాణాంతకమంటూ ‘స్టాప్ యూజ్’ నోటీసు జారీ చేశారు. ‘ప్రజలు ఈ సిరప్‌ను వాడటం వెంటనే ఆపేయాలి. మీ దగ్గర ఈ మందు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలి’ అని కోరారు.

News January 10, 2026

వచ్చే సీజన్‌లోనూ డెడ్ స్టోరేజీకి సింగూర్ !

image

సింగూరు జలాశయం ఆనకట్టతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ఆఫ్రాన్ భాగాలు కూడా దెబ్బతిన్నాయి. తరచూ మొరాయించే గేట్ల మరమ్మతులు, రంగుల పూత పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యలన్నింటినీ సమగ్రంగా పరిష్కరించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే సీజనులో ఈ మరమ్మతు, పునరుద్ధరణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందుకోసం ప్రాజెక్టు నీటిమట్టాన్ని డెడ్ స్టోరేజీ స్థాయికి తగ్గించనున్నారు.

News January 10, 2026

మహిళా ఆఫీసర్, మంత్రిపై ఆరోపణలు.. ఖండించిన IAS అసోసియేషన్

image

TG: మహిళా IASపై ఓ మంత్రి ఆపేక్ష చూపిస్తున్నారంటూ ఓ న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేయడాన్ని TG IAS ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. మహిళా అధికారిపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది. దీనిని మహిళా ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్‌పై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థను డిమాండ్ చేసింది. ఇలాంటి దురుద్దేశపూర్వక కంటెంట్‌ను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలను హెచ్చరించింది.