News February 10, 2025

ఎన్టీఆర్: ‘ఇంటికి రమ్మని చెప్పి.. అఘాయిత్యం’

image

కంచికచర్లలో విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీటెక్ చదువుతున్న విద్యార్థిని హుస్సేన్‌, ప్రేమించుకున్నారు. హుస్సేను ఆమెను ఇంటికి రమ్మని పిలిచి తన స్నేహితులను రప్పించి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశారు. అరుపులు వినపడకుండా టీవీ సౌండ్ పెట్టారు. ఎవరికైనా చెప్తే వీడియోలు బయటపెడతామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.

Similar News

News April 18, 2026

సత్యసాయి: కార్లు అద్దెకు తీసుకొని మోసం.. నిందితుడి అరెస్ట్

image

కార్లను బాడుగకు తీసుకొని, యజమానులకు తెలియకుండా కుదువ పెట్టి మోసం చేసిన అన్నవరం గౌతం రాజును సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు యజమానులను నమ్మించి మూడు కార్లు తీసుకొని, వాటిని ఇతరుల వద్ద కుదువ పెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

News April 18, 2026

ప్రకాశం: రైతుల కోసం బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశాలు

image

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

News April 18, 2026

సర్వీస్ ఇనామ్ భూములకు విముక్తి

image

AP: గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ భూములకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించింది. రాష్ట్రంలో 1,36,024 ఎకరాలను ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తున్నామని, నిషేధ జాబితా 22(A) నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో వీటి క్రయ, విక్రయాలకు, రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించనుంది. అవి పట్టా భూములుగా రికార్డుల్లో ఉంటాయి.