News February 10, 2025
కర్నూలు జిల్లాలో 6,42,391 మందికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

కర్నూలు జిల్లాలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధమైంది. నేడు జాతీయ నులి పరుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 6,42,391 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల సిబ్బందితో పాటు అంగన్‌వాడీ, విద్యాశాఖ సిబ్బంది భాగస్వామ్యం కానున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం మింగించేలా ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌వో డా.శాంతికళ తెలిపారు.
Similar News
News January 25, 2026
ఆస్పరి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన తలారి నాగరాజు (35) ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పరి-నగరూరు రైల్వే స్టేషన్ల మధ్య ముంబై నుంచి చెన్నై వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆయన ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 25, 2026
రైతుల సంక్షేమానికి ఏపీఏంఐపీ కృషి చేయాలి: కలెక్టర్

రైతుల సంక్షేమానికి ఏపీఏంఐపీ కార్యాలయం మరింత సమర్థవంతంగా సేవలందించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. ఆదివారం కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలో పునరుద్ధరించిన ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో కలిసి ప్రారంభించారు. జిల్లాలోని రైతులకు సూక్ష్మ నీటి సాగు పరికరాలు, రాయితీలు, సాంకేతిక సలహాలను మరింత చేరువ చేయాలని కలెక్టర్ సూచించారు.
News January 25, 2026
అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలైన ఏడుగురికి పీవోఏ యాక్ట్ కింద ఐటీఐ, అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో వారికి నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.


