News February 10, 2025
విశాఖ: పండుగ మిగిల్చిన విషాదం

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్రతీరంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. వారు సూర్యదేవుని నోములు పండుగకు కుటుంబ సభ్యులతో వెళ్లారు. అందులో సూర్యతేజ్(17), పవన్ తేజ్ సముద్రంలో ఈతకు దిగారు. అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయారు. దగ్గరలోని మత్స్యకారులు సూర్యతేజను బయటకు తీసీ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. పవన్ తేజ ఆచూకీ తెలియాల్సి ఉంది.
Similar News
News March 28, 2026
ఏ వయసు వారు ఎంత సేపు నడవాలి?

ఫిట్‌గా ఉండటానికి నడక ఒక ఈజీ మార్గం. వయసును బట్టి ఎంత సేపు నడవాలో డాక్టర్లు చెప్పారు. 5-12 ఏళ్ల పిల్లలు రోజుకు 60 నిమిషాలు, టీనేజర్లు 45-60 నిమిషాలు నడవాలి. 20-40 ఏళ్ల వారు 30-45 నిమిషాలు, మిడిల్ ఏజ్ వారు 30-40 నిమిషాలు వాకింగ్ చేస్తే BP కంట్రోల్‌లో ఉంటుంది. 60 దాటిన వారు రోజుకు 20-30 నిమిషాలు నడిస్తే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇలా రెగ్యులర్‌గా నడిస్తే బాడీతో పాటు బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుంది.
News March 28, 2026
లిల్లీ మొక్కల్లో ఆకుమచ్చ తెగులు – నివారణ

లిల్లీ సాగులో ఆకుమచ్చ తెగులు శిలీంధ్రాల వల్ల వస్తుంది. దీని వల్ల ఆకులపై నీటిలో నానినట్లు ఉండే మచ్చలు చిన్న చిన్నవిగా ఏర్పడి, అవి క్రమంగా గోధుమ రంగులోకి మారతాయి. తెగులు ఉద్ధృతి ఎక్కువైతే ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు మొత్తం ఎండిపోయి మొక్క మొత్తం మాడిపోయినట్లు కనిపిస్తుంది. పూల దిగుబడి పడిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2ml లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి పిచికారీ చేయాలి.
News March 28, 2026
కర్నూలు: పెళ్లింట విషాదం.. మృతి చెందిన నలుగురు వీరే..!

కర్నూలు(D) కోసిగి మండలం కందుకూరుకు చెందిన దాసరి ఆదిశేషు ఇంట్లో వివాహ శుభకార్యానికి వచ్చిన వారి బంధువులు తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి నలుగురు <<19491995>>మృత్యువాత<<>> పడిన విషయం తెలిసిందే. మృతులు దాసరి ఉమావతి, దాసరి రత్నమ్మ, దాసరి శివానంద, దాసరి మహంతేశ్‌గా గుర్తించారు. మృతి చెందిన నలుగురు కర్ణాటక రాష్ట్రం మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది.


