News February 10, 2025

మంథని: కోడలిపై మామ లైంగిక వేధింపులు..?

image

అత్తింటివారు వేధిస్తున్నారని మంథని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఓ యువతి నిరసన చేసింది. బాధితురాలి వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన యువతికి పోచమ్మవాడకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. ఆమె గర్భవతి కాగా మామ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. గత నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లింది. భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పడంతో ఆదివారం నిరసన చేపట్టింది. కేసు నమోదు చేసినట్లు SI రమేశ్ తెలిపారు.

Similar News

News November 13, 2025

‘పీక్ కోల్డ్‌వేవ్’: తెలంగాణపై చలి పంజా!

image

రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఈరోజు నుంచి ‘పీక్ కోల్డ్‌వేవ్’ పరిస్థితులు ప్రారంభం కానున్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 10°C-8°C వరకు పడిపోయే అవకాశం ఉంది. ఈనెల 18 వరకు ఇది కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ టెంపరేచర్ 13°C-11°Cకి పడిపోతుందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.

News November 13, 2025

నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

image

మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర అభివృద్ధిలో భాగంగా Y జంక్షన్ నుంచి జంపన్న వాగు వరకు చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు, డివైడర్, ప్లాంటేషన్ పనులను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మేడారంలో పర్యటించిన మంత్రి, జాతర సమీపిస్తున్నందున పనుల వేగాన్ని పెంచాలన్నారు.

News November 13, 2025

పెదపాలపర్రులో వ్యక్తి అస్థిపంజరం లభ్యం

image

ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో పాడుబడిన పెంకుటింట్లో బుధవారం కుళ్లిపోయిన వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది. పిల్లులు పట్టుకోవడానికి వెళ్లిన వ్యక్తి ఈ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వీరభద్రరావు వివరాలు సేకరించారు. నాలుగు నెలల క్రితం అదృశ్యమైన రైతు సంకురాత్రి తులసీ మాధవరావు (59)గా బంధువులు ఈ అస్థిపంజరాన్ని గుర్తించారు. కేసు నమోదు చేశారు.