News February 10, 2025

ప్రకాశం జిల్లా ప్రజలు జాగ్రత్త..!

image

ప్రకాశం జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న ప్రకాశం జిల్లాలో గరిష్ఠంగా 33.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా నీరు, కొబ్బరినీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Similar News

News March 14, 2026

కనిగిరి: పాపం.. ఈ కష్టం ఏ తల్లికీ రాకూడదు..!

image

ఇటీవల S.కొండలోని నవోదయ కోచింగ్ సెంటర్‌లో అనుమానాస్పద స్థితిలో కనిగిరికి చెందిన తౌషిక్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తౌషిక్ తల్లి మౌలాబి శుక్రవారం కొన్ని గంటలపాటు కనిపించకుండా పోయిందని బంధువులు ఆందోళన చెందారు. సాయంత్రం వేళలో శ్మశానవాటికలోని తౌషిక్ సమాధి వద్ద పడుకొని ఏడుస్తూ ఉండటం గమనించిన స్థానికులు ఆమెను వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ విషాద ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

News March 13, 2026

పవన్ ‘ఫ్లాప్ స్టార్’: MLA తాటిపర్తి

image

యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా DyCM పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సినిమాల్లో ‘పవర్ స్టార్’ బిరుదు ఎలా వచ్చిందో దేవుడికే తెలుసని వ్యాఖ్యానించిన ఆయన, ప్రభుత్వ పరిపాలనలో మాత్రం ఫ్లాప్ స్టార్ అయిపోయారని ట్వీట్ చేశారు. గత రెండేళ్లలో అటవీ శాఖ ద్వారా కేవలం రూ.83 కోట్ల సంపద మాత్రమే సృష్టించారని, ఆ డబ్బు కూడా షూటింగ్ ట్రిప్పులకే ఖర్చు అయిపోయి ఉంటుందని ఎద్దేవా చేశారు.

News March 13, 2026

ప్రకాశం: మత్స్యకారుడి గొంతులో ఇరుక్కున్న బతికున్న చేప.. చివరికి

image

ప్రకాశం జిల్లాలో గురువారం వింత ఘటన చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. అనంతరం చేపలు పట్టి బుట్టలో వేస్తుండగా ఓ చేప ఎగిరి అతని నోటిలో పడింది. తీసేలోపే అది కాస్తా గొంతులోకి వెళ్లింది. గమనించిన తోటి మత్స్యకారులు అతణ్ని వెంటనే ఒంగోలు GGHకు తరలించారు. ENT వైద్యులు HOD డాక్టర్ ప్రభాకర్ బృందం శస్త్రచికిత్స చేసి చాపను బయటకు తీశారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా ఉన్నారు.