News February 10, 2025
బాపట్ల: చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నం

బాపట్ల జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్లూరులో గత నెల 29న తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఇంటిపక్కనుండే ఉదరగడి లక్ష్మయ్య(50) బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి, దుస్తులు తీస్తుండగా పారిపోయింది. ఎవరికీ చెప్పకుండా భయపడుతుండటంతో బాలికను ప్రశ్నించడంతో ఈనెల 5న తెలిసింది. విషయాన్ని గ్రామ పెద్దలకు తెలపడంతో వారి సాయంతో పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News March 25, 2026
ఆంధ్రా యూనివర్సిటీలో ఘనంగా 91, 92వ స్నాతకోత్సవం

ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆంధ్రా యూనివర్సిటీ 91, 92వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుకలో 441 మందికి పీహెచ్‌డీలు, 174 మెడల్స్ ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా పూర్ణచంద్రరావు సగ్గుర్తి, పతంజలి శాస్త్రి హాజరయ్యారు. కార్యక్రమంలో వీసీ రాజశేఖర్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తమ పరిశోధనలు చేసిన పలువురు ఆచార్యులకు అవార్డులు అందజేశారు.
News March 25, 2026
గద్వాల: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి: కలెక్టర్

నమూనా ఐక్యరాజ్యసమితి (Model United Nations) సర్వసభ్య సమావేశం నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం గద్వాల కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 193 సభ్య దేశాల పనితీరుపై విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
News March 25, 2026
HYD: RTC బస్సుల్లో భారీగా డిస్కౌంట్

పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. HYDలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ ప్రకటించింది. పెట్రోల్ బంకుల వద్ద క్యూలకు బదులుగా ప్రజా రవాణా వినియోగించాలని ఎండీ నాగిరెడ్డి సూచించారు. ఇది ఇంధన పొదుపు, కాలుష్య తగ్గింపు, ప్రయాణికులకు సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. నగరంలో పెట్రోల్ కొరత లేదని అధికారులు చెప్పినా బంకుల వద్ద క్యూ లైన్లు తగ్గడం లేదు.


