News February 10, 2025

తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద కెమెరాలు

image

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మెగా కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆయన నివాసం వద్ద చెలరేగిన మంటలను దృష్టిలో ఉంచుకుని అక్కడ నిఘా పెంచారు. మొత్తం ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చే చిత్రాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ నుంచి మానిటర్ చేయనున్నారు.

Similar News

News April 18, 2026

ఒకేషనల్ విద్యార్థులకు క్లినికల్ శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ MPHW(F), MLT ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఏడాది పాటు క్లినికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు తెలిపారు. తిరుమలాయపాలెం, సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రుల్లో 30 మంది చొప్పున, వైరాలో 10 మందికి అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల వారు ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు

News April 18, 2026

చంద్రబాబుకూ నితీశ్, షిండే పరిస్థితే: సీఎం రేవంత్

image

TG: బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. ‘బిహార్‌లో నితీశ్ కుమార్, మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే మాదిరే భవిష్యత్తులో టీడీపీ, చంద్రబాబు పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో తక్కువ సీట్లు ఉన్నాయని టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పడేస్తారు’ అని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.

News April 18, 2026

BREAKING: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

image

చిన్నస్వామి స్టేడియం వేదికగా RCBతో జరగనున్న మ్యాచులో టాస్ గెలిచిన DC కెప్టెన్ అక్షర్ బౌలింగ్ ఎంచుకున్నారు.
RCB: సాల్ట్, కోహ్లీ, పడిక్కల్, రజత్, జితేశ్,డేవిడ్, షెపర్డ్, కృనాల్, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, సుయాష్
DC: KL రాహుల్, నిస్సాంక, రిజ్వీ, అక్షర్, మిల్లర్, స్టబ్స్, నబీ, ఎంగిడి, కుల్దీప్, నటరాజన్, ముఖేశ్