News February 10, 2025

HYD: అలా చేస్తే.. మీ భరతం పడతాం: హైడ్రా

image

HYD నగరం సహా, ORR వరకు అనుమతులు లేకుండా రోడ్లపై, రోడ్లకు ఇరుపక్కలా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే మీ భరతం పడతామని హైడ్రా హెచ్చరించింది. ఇటీవల శంషాబాద్‌లో భారీ హోర్డింగ్ తొలగించినట్లు ఉదహరించింది. ఎక్కడైనా ప్రమాదకరమైన హోర్డింగులు ఉంటే తమ దృష్టికి తేవాలని హైడ్రా కోరింది. ఎక్కడికక్కడ కఠిన చర్యలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.

Similar News

News March 21, 2026

భారత్ – ఐర్లాండ్ మధ్య 2 టీ20లు

image

భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ20ల షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. జూన్ 26, 28వ తేదీల్లో 2 మ్యాచులు ఆడనున్నట్లు పేర్కొంది. 2 టీ20లూ బెల్‌ఫాస్ట్(ఐర్లాండ్) వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 2007 తర్వాత ఈ వేదికలో భారత్ మళ్లీ ఇప్పుడే ఆడనుంది. ఆ వెంటనే జులై 1 నుంచి 11వ తేదీ వరకు భారత్-ఇంగ్లండ్ మధ్య 5టీ20లు జరగనున్నాయి.

News March 21, 2026

నిర్మల్: పర్యావరణానికి అటవీ సంపద ఊపిరి

image

ఉమ్మడి జిల్లాలో అటవీ విస్తీర్ణం పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 1,778.26 చ.కి.మీ అడవి ఉండగా, మంచిర్యాల 1,564.93, ఆదిలాబాద్‌ 1,145.76, నిర్మల్‌లో 1,085.02 చ.కి.మీ విస్తరించి ఉంది. ఈ అటవీ సంపద ప్రాంతీయ జీవవైవిధ్యానికి, వర్షపాత సమతుల్యతకు దోహదపడుతోంది. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో ఈ అడవులు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.

News March 21, 2026

పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

image

హైదరాబాద్‌లో వేర్వేరు ఘటనల్లో పెంపుడు పిల్లుల కోసం ఇద్దరు విద్యార్థినులు తనువు చాలించడం విస్మయానికి గురిచేస్తోంది. పిల్లిని ఇంట్లోకి తేవొద్దన్నందుకు అల్వాల్‌కు చెందిన MBBS స్టూడెంట్ శ్రేష్ఠ నిన్న తల్లితో గొడవపడి సూసైడ్ చేసుకుంది. 3 రోజుల క్రితం మీర్‌పేట్‌లోనూ BSc విద్యార్థిని హిమబిందు పెంపుడు పిల్లి చనిపోయిందని ఆత్మహత్య చేసుకుంది. పెట్స్‌పై ప్రేమతో ప్రాణాలు తీసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.