News February 10, 2025
HYD: సచివాలయంలో నేడు సీఎం సమీక్ష
సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలోని తన పరిధిలోని శాఖలపై సీఎం సమీక్షించి, ఆయా శాఖల పనితీరు, పని స్వభావం గురించి అధికారులతో చర్చించనున్నారు. తన పరిధిలో ఉన్న ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం.
Similar News
News February 11, 2025
HYD: రూ.వేలకు వేలు వసూలూ.. అయినా లేట్
ప్రైవేటు బస్‌ల ఆగడాలు ప్రయాణికులకు నరకంగా మారింది. వేలకు వేలు టిక్కెట్ల రూపంలో వసూలు చేసి మధ్యలోనే బస్ చెడిపోయిందని తీవ్ర ఆలస్యం చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కనీసం మరో బస్ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం లేదని ట్రావెల్స్ ఆఫీస్‌కి కాల్ చేస్తే రెస్పాన్స్ లేదంటున్నారు. తాజాగా విజయవాడ జాతీయ రహదారిపై శివారు ప్రాంతంలో ప్రయాణికులకు ఇలాంటి అనుభవమే ఎదురై తీవ్ర ఇబ్బంది పడ్డట్లు తెలిపారు.
News February 11, 2025
HYD: మూసీకి రూ.37.50 కోట్లు కేటాయింపు!
మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 1,500 కుటుంబాలను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.25,000 అందించనున్నట్లు పేర్కొన్నారు.
News February 11, 2025
HYD: ఆఫీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై కలెక్టర్ నిఘా
HYD కలెక్టరేట్‌లో పనిస్తున్న ఉద్యోగులపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక నిఘా పెట్టారు. వేళలు పాటించకుండా కార్యాలయాలకు రావడం, పనివేళలు ముగియకముందే ఇంటిబాట పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఎవరు ఎప్పుడొస్తున్నారు? ఎంతసేపు పనిచేస్తున్నారు? అనే వివరాలను సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.