News February 10, 2025
సూర్యాపేటలో మహిళతో సహజీవనం.. కుమార్తెలపై అత్యాచారం

సూర్యాపేటలో ప్రభుత్వ టీచర్ ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాలిలా.. మామిళ్లగడ్డ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న అతను భార్యతో దూరంగా ఉంటూ 2018 నుంచి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అతని కన్ను ఆమె కుమార్తెలపై పడింది. వారికి మత్తు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఓసారి మహిళ చూసి ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News September 18, 2025
గుంటూరులో డయేరియా కేసులు

గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కలుషితమైన ఆహారం, నీటి వల్ల వాంతులు, విరోచనాలు పెరిగాయని వైద్యులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 35 మంది అతిసార లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారు. అతిసార రోగులకు ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తెలిపారు.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
కాకినాడ: ఏపీలోనే తొలిసారిగా.. మన తలుపులమ్మ లోవలో..!

ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ ఆలయంలో రూ.4 కోట్లతో ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కొండప్రాంతం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు ఎస్కలేటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ సదుపాయం ఏర్పాటు చేస్తున్న మొదటి దేవాలయం తలుపులమ్మ లోవ కానుంది.