News February 10, 2025

తాళ్లరేవు: 119 మంది అరెస్ట్.. రూ.9లక్షలు స్వాధీనం

image

తాళ్లరేవు మండలం వేమవరం సమీపంలో కోడిపందేలు నిర్వహిస్తున్న శిబిరంపై ఆదివారం రాత్రి కోరంగి ఎస్ఐ సత్యనారాయణరెడ్డి బృందం దాడులు చేసింది. కోడిపందేలు నిర్వహిస్తున్న 119 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి తొమ్మిది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం, పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు దొరకడం ఇదే మొదటిసారి అని పోలీసులు చెబుతున్నారు.

Similar News

News April 2, 2026

GNT: పెరిగిన పాల ధరలు.. ఎంతంటే..!

image

ఇప్పటికే ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యుడిపై పాల ధరలు భారమయ్యాయి. లీటరు పాలపై రూ.2 చొప్పున ధర పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. పాల సేకరణ, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.

News April 2, 2026

ఉండవల్లి ఫైరింగ్ రేంజ్ ఆక్టోపస్‌కి కేటాయింపు

image

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరిధిలోని ఉండవల్లి ఫైరింగ్ రేంజ్‌ను OCTOPUS విభాగానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. 45 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ రేంజ్ గత ఐదు దశాబ్దాలుగా వినియోగంలో ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పోలీసులు ఇక్కడ శిక్షణ పొందుతుండగా, ఇప్పటివరకు తాడేపల్లి వడ్డేశ్వరం వద్ద ప్రైవేట్ భవనంలో OCTOPUS విభాగం ఉంది.

News April 2, 2026

9 కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రానికి ప్రతిపాదన

image

AP: ₹915CRతో 9 పర్యాటక ప్రాజెక్టుల కోసం మంత్రి దుర్గేశ్ కేంద్ర మంత్రి షెకావత్‌కి ప్రతిపాదనలు అందించారు. మచిలీపట్నం బీచ్ అభివృద్ధికి ₹120.04CR ఇవ్వాలన్నారు. ₹95.18CRతో మంగళగిరి, ₹213.72CRతో అరసవల్లి, ₹48.95CRతో నెల్లూరు గృహ మల్లేశ్వర స్వామి,₹36CRతో కోరుకొండ నరసింహస్వామి, ₹120CRతో వాడపల్లి ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదించారు. లేపాక్షిలో, లంబసింగి, బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ₹280.24CR ఇవ్వాలని కోరారు.