News February 10, 2025
గాజాను సొంతం చేసుకొని పునర్నిర్మిస్తాం: ట్రంప్

గాజాను సొంతం చేసుకొని పునర్నిర్మిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మధ్య ఆసియాలోని ఓ ప్రాంతానికి దాన్ని అప్పగించి తమ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. హమాస్ అక్కడికి తిరిగి రాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే పాలస్తీనా శరణార్థులు కొందరిని అమెరికాలోకి అనుమతించేందుకు అవకాశం ఉందని, అయితే ఆ మేరకు వచ్చిన వినతులను సమీక్షించిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు.
Similar News
News March 10, 2026
గ్యాస్ సరఫరా లేక హోటళ్లు బంద్!

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిషేధించలేదని కేంద్రం స్పష్టం చేసినా గ్రౌండ్ లెవెల్‌లో సప్లై జరగడం లేదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ పేర్కొంది. ‘సిలిండర్ల సరఫరాలో గృహాలకు ప్రయారిటీ ఇవ్వాలని కేంద్రం చెప్పడంతో అయోమయం నెలకొంది. దీనిపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇవ్వాలి’ అని Xలో కోరింది. కాగా గ్యాస్ సరఫరా లేక ఇవాళ్టి నుంచి హోటళ్లు బంద్ చేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.
News March 10, 2026
నేపాల్‌లో RSP ఘన విజయం.. మోదీ కంగ్రాట్స్

నేపాల్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 165 స్థానాలకు గాను రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 125 చోట్ల గెలిచింది. నేపాలీ కాంగ్రెస్ 18, CPN(UML) 9, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ 7, మిగతా పార్టీలు 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఓ చోట రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. ఘన విజయం సాధించిన RSP ప్రెసిడెంట్ రవి లామిచానే, ప్రధాని అభ్యర్థి బాలెన్ షాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.
News March 10, 2026
4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. వారంలో షెడ్యూల్?

అస్సాం, కేరళ, WB, TN, పుదుచ్చేరి(UT)లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. EC వారంలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం CEC జ్ఞానేశ్ కుమార్ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. స్థానిక పండుగలను పరిగణనలోకి తీసుకోవాలని పలు పార్టీలు ECకి విజ్ఞప్తి చేశాయి. కాగా బెంగాల్‌లో ఎన్నికలను రెండు దశల్లోనే పూర్తి చేయాలని TMC, BJP, INC, CPM, AAP నేతలు కోరారు.


