News February 10, 2025

WNP: నీటి గుంతలో పడి బాలుడి మృతి

image

నీటిగుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలం మాధవరావుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నందిని, వినోద్‌ల కుమారుడు రుద్రరాజు(2) ఆదివారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. చిన్నారిని వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News March 3, 2026

ఇరాన్ మౌనంగా ఉండదు.. అధ్యక్షుడి వార్నింగ్

image

అమెరికా-ఇజ్రాయెల్ మానవత్వ విలువలను పట్టించుకోవట్లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ విమర్శించారు. ఆస్పత్రులు, దేశ భవిష్యత్ అయిన స్కూళ్లను టార్గెట్ చేసుకున్నారని ట్వీట్ చేశారు. రోగులు, పిల్లలపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. ప్రపంచమంతా దీన్ని ఖండించాలని, తాను దేశం తరఫున నిలబడతానని స్పష్టం చేశారు. ఇరాన్ ఇలాంటి నేరాలకు లొంగిపోదని, మౌనంగా ఉండదని హెచ్చరించారు.

News March 3, 2026

రూ.1000 కోట్లతో ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు!

image

TG: రాష్ట్రంలోని అద్దె గృహాల్లో ఉన్న ఆఫీసులకు దశలవారీగా సొంత భవనాలు నిర్మించాలని GOVT నిర్ణయించింది. తద్వారా చెల్లిస్తున్న కోట్లాది రూపాయలు అద్దెల భారాన్ని తగ్గించుకోనుంది. మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆఫీసులు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదని, వాటికి నిర్ణీత విస్తీర్ణంలో సొంత భవనాలు నిర్మించాలని CM ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో వీటికి ₹1000 CR నిధులు కేటాయించనున్నారు.

News March 3, 2026

SRCL: అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మహిళా సమైక్య భవనాల నిర్మాణ పనులను 3 రోజుల్లోగా ప్రారంభించాలని కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ శాఖ పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా మహిళా సంఘ భవనాలను పూర్తి చేయాలని, తుది దశలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.