News February 10, 2025
తాండూర్: మాదారం బీట్‌లోకి పెద్దపులి

బెల్లంపల్లి మండలంలోని కన్నాల- బుగ్గ అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి కన్నాల అడవుల మీదుగా మాదారం బీట్ లోకి వెళ్లిపోయినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. బుగ్గ దేవాలయం సమీపంలోని కొండ పోచమ్మ గుడి పక్క నుంచి గుట్టల మీదుగా తాండూరు మండలంలోని మాదారం బీట్ లోకి వెళ్లినట్లు పాదముద్రల ఆధారంగా నిర్ధారించినట్లు ముత్యంపల్లి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయక్ తెలిపారు.
Similar News
News March 12, 2026
ఆదోనిలో లెటర్ రాసి సూసైడ్

ఆదోనిలోని కల్లుబావి వీధిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. కురువ రాఘవేంద్రకు రెండెకరాలు సొంత పొలం ఉంది. దీంతో పాటు మరో ఐదెకరాలలో వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం, ఇతర ఖర్చుల కోసం రూ.10 లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక అయోమయానికి గురై తన చావుకు అప్పులే కారణం అంటూ లెటర్ రాసి ఇంట్లో ఉరేసుకొన్నాడు.
News March 12, 2026
డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌కు వాడొద్దు: సివిల్ సప్లై కమిషనర్

TG: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ అక్రమ వినియోగంపై టోల్ ఫ్రీ నంబర్ల(1967, 180042500333)కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో ₹2.36L విలువైన సిలిండర్లను పట్టుకున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 7 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
News March 12, 2026
టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా కొనసాగడం కష్టమే: మెక్‌గ్రాత్

భారత పేసర్ బుమ్రా టెస్ట్ భవిష్యత్తుపై AUS దిగ్గజ బౌలర్ మెక్‌గ్రాత్ ఆందోళన వ్యక్తం చేశారు. వయస్సు పెరుగుతుండడం, వర్క్ లోడ్ కారణంగా బుమ్రా వరుసగా టెస్టుల్లో ఆడటం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లతో జరిగే టెస్టులకే బుమ్రా పరిమితం కావచ్చని, ఇది టెస్ట్ క్రికెట్‌కు పెద్ద లోటని అన్నారు. T20ల్లోనూ టెస్ట్ లెంగ్త్ బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అరుదైన బౌలర్ బుమ్రా అని ప్రశంసించారు.


