News February 10, 2025
సింగరేణి ఇంటర్వ్యూకు బెల్లంపల్లి రీజియన్ అధికారులు

సింగరేణి సంస్థల డైరెక్టర్లు (P& P), డైరెక్టర్(ఆపరేషన్)పోస్టుల ఎంపికకు రంగం సిద్ధమైంది. డైరెక్టర్ల ఎంపిక కోసం పలువురు GMలకు ప్రభుత్వం, CMDబలరాం నాయక్ నుంచి పిలుపు వచ్చింది. బెల్లంపల్లి రీజియన్‌లో పనిచేస్తున్న శ్రీరాంపూర్ GM సూర్యనారాయణ, మందమర్రి GM దేవేందర్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ GM రఘుకుమార్‌కు సోమవారం మధ్యాహ్నం ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉంది.
Similar News
News January 29, 2026
కామారెడ్డి జిల్లాలో రెండో రోజు 348 నామినేషన్లు

కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో రెండో రోజు 348 నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 203 (కాంగ్రెస్ 86, BRS 45, BJP 51, JS 6, TRP 2, AIMIM 1, CPM 1, IND 11), బాన్సువాడలో 87 (కాంగ్రెస్ 54, BRS 20, BJP 12, AIMIM 1, IND 3), ఎల్లారెడ్డిలో 24 (కాంగ్రెస్ 9, BRS 6, BJP 7, IND 2), బిచ్కుందలో 34 (కాంగ్రెస్ 9 , BRS 11, BJP 4,IND 10) చొప్పున నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
News January 29, 2026
రేపు పాఠశాలలు, కళాశాలలకు సెలవు: కలెక్టర్

మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 30వ తేదీన (శుక్రవారం) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేదీ రెండో శనివారం పాఠశాలలు, కళాశాలలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ ఆదేశాలను విద్యాశాఖ అధికారులు, పాఠశాల యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు.
News January 29, 2026
రాత్రి నానబెట్టి ఉదయం తింటే..

రోజువారీ ఆహారంలో పెసలు తప్పకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉండే పెసలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి.
*పీచు పదార్థం ఆకలిని నియంత్రించి బరువు తగ్గేలా చేస్తుంది.
*చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తుంది.
*గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయి.
**రాత్రి నానబెట్టి ఉదయం మొలకల రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.


