News February 10, 2025
వికారాబాద్: ప్రత్యేక పాలనకే మొగ్గు!

PACS గడువు ఈ నెల 20తో ముగియనుంది. జిల్లాలో 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా.. మరో 10 PACS కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో PACS ప్రత్యేక అధికారుల పాలనకే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. 14 Feb 2020న సహకార సంఘాలకు ఎన్నికలు జరగ్గా, అదే నెలలో 17 నుంచి 19వ తేదీ వరకు నూతన పాలక వర్గాలను ఎన్నుకున్నారు.
Similar News
News March 14, 2026
నెల్లూరు: కిరోసిన్ అయినా ఇవ్వండి సార్..!

నెల్లూరు జిల్లాలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్ సర్వర్ పనిచేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ లేక ఇళ్లలో అవస్థలు పడుతున్నామని.. సమస్య పరిష్కారమయ్యే వరకు తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేయాలని ప్రజలు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.
News March 14, 2026
జడ్చర్ల: రేపటి నుంచే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్లాసులు

జడ్చర్లలోని డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్టడీ సెంటర్‌లో ఆదివారం నుంచి కౌన్సిలింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. డిగ్రీ 1, 2, 3వ సంవత్సరాల విద్యార్థులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు తరగతులకు హాజరు కావాలని ప్రిన్సిపల్ సుకన్య, కోఆర్డినేటర్ సదాశివయ్య కోరారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 14, 2026
కల్తీపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్: మంత్రి

AP: పాలు, నెయ్యి, వెన్నలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాల వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కల్తీ పాలు కిడ్నీలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. కొనేటప్పుడు FSSAI లోగో, లైసెన్స్ నంబర్ సరిచూసుకోవాలని సూచించారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1100, 1800 425 3857కు కాల్ చేయాలన్నారు. కల్తీపై అవగాహన పెంచుకోవడం ముఖ్యమని ట్వీట్ చేశారు.


