News February 10, 2025
NLG: రేపు ముసాయిదా జాబితా విడుదల

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. NLG జిల్లాలో 33 ZPTCలు, 352 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.
Similar News
News March 24, 2026
బాధితులకు తక్షణ న్యాయం అందించాలి: ఎస్పీ

బాధితుల ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి, మెరుగైన సేవలందించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. మంగళవారం ఆయన తిప్పర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులో అలసత్వం వహించరాదని, గంజాయి,అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పర్యవేక్షణ పెంచి శాంతిభద్రతలకు కృషి చేయాలని అన్నారు.
News March 24, 2026
నల్గొండ: క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం!

నల్గొండ జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ రెండో దశ వంద రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
News March 24, 2026
సేద్యంపై ‘శాపం’.. ఎండిపోతున్న పైర్లు

నల్గొండ జిల్లాలో సాగునీరు అందక పంట పొలాలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు అల్లాడిపోతున్నారు. మునుగోడు మండలం ఉకోండిలో భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు పోయక పరిస్థితి దారుణంగా మారింది. చేతికొచ్చే దశలో వరి, ఇతర పంటలు ఎండుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి దక్కేలా లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీటి ఇబ్బందులను తొలగించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.


