News February 10, 2025
బెస్ట్ విలన్ టాలెంట్ అవార్డు అందుకున్న బాడంగి దాసరి

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ విలన్ టాలెంట్ అవార్డును బాడంగికి చెందిన దాసరి తిరుపతినాయుడు ఆదివారం అందుకున్నారు. విప్లవ నటుడు ఆర్.నారాయణమూర్తి నటించిన యూనివర్సిటీ చిత్రంలో విలన్’గా దాసరి నటించాడు. బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన తిరుపతినాయుడు డ్రామా ఆర్టిస్టుగా పనిచేసేవారు. సినిమాలో అవకాశం రావడంతో విలన్’గా నటించి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
Similar News
News January 24, 2026
కొత్తవలస రైల్వేస్టేషన్‌లో అమృత్ భారత్ రైళ్ల నిలుపుదల

అమృత్ భారత్ స్టేషన్‌గా అభివృద్ధి చెందుతున్న కొత్తవలస రైల్వే స్టేషన్‌లో పలు అమృత్ భారత్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ సీఎమ్ కె. పవన్ కుమార్ తెలిపారు. రైళ్లు (16597/98, 16223/24, 16107/08, 16523/24) ఇకపై ఇక్కడ ఆగనున్నాయన్నారు. ఈ రైళ్లు విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండా విజయనగరం, కొత్తవలస, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు.
News January 24, 2026
VZM: ‘పరిశ్రమల అనుమతులు గడువు లోపలే ఇవ్వాలి’

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను గడువు లోపలే ఇవ్వాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. సింగిల్ విండో విధానం ద్వారా డిసెంబర్ 26 నుంచి జనవరి 20 వరకు వచ్చిన 649 దరఖాస్తుల్లో 618కి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. భూ సమస్యలను పరిష్కరిస్తామని, పారిశ్రామిక వేత్తలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.