News March 20, 2024
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్

కామారెడ్డి, జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించడానికి నోడల్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆర్.డి.ఓ.లు, డి.ఎస్పీలు, తహశీల్ధారు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన జూమ్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డబ్బులు, మద్యం రవాణా కాకుండా తనిఖీలు చేపట్టాలని సూచించారు.
Similar News
News October 22, 2025
NZB: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి ఉన్నారు.
News October 22, 2025
కొమురం భీం పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం: ఎమ్మెల్సీ కవిత

కొమురం భీం నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
News October 22, 2025
NZB: అన్నదాతలను కాంగ్రెస్ అరిగోస పెడుతోంది: కవిత

కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన పాపానికి అన్నదాతలను అరిగోస పెడోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులే ఏకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకన్నా రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని ట్వీట్ చేశారు.


