News February 10, 2025

ఆసిఫాబాద్: నేటి నుంచి పలు రైళ్లు రద్దు

image

మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని సిర్పూర్ కాగజ్‌ నగర్‌, రెబ్బెన, బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వే స్టేషన్ల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు నేటి నుంచి 20వ తేదీ వరకు రద్దయ్యాయి. ఖమ్మం రైల్వే స్టేషన్‌ వద్ద నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.

Similar News

News March 16, 2026

అన్నదాన కార్యక్రమాలకు సౌరశక్తిని వినియోగించాలి: జేసీ

image

యుద్ధం నేపథ్యంలో వాణిజ్య LPG గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దేవాలయాల్లోని అన్నదానం, అక్షయపాత్ర అన్న క్యాంటీన్ల నిర్వహణకు సౌరశక్తి ఆధారిత కుకింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి సూచించారు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని సోమవారం మున్సిపల్ కమిషనర్లు, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

News March 16, 2026

భారత్‌కు ఆయిల్ తేవడమే టార్గెట్.. యుద్ధంలోనూ తగ్గేదేలే!

image

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్నా భారతీయ నౌకలు క్రూడ్‌తో దేశానికి సేఫ్‌గా తిరిగొస్తున్నాయి. తాజాగా జగ్ లాడ్కి అనే నౌక సాహసోపేతంగా వార్ జోన్‌ను దాటేసింది. UAEలోని ఫుజైరా పోర్టుపై శనివారం దాడి జరిగినప్పుడు ఈ నౌక చమురు నింపుకుంటోంది. అయినా 80,800 టన్నుల ముర్బాన్ క్రూడ్ లోడ్ చేసుకొని నిన్న తిరుగుప్రయాణమైంది. కాగా 92,712 టన్నుల LPGతో శివాలిక్, నందాదేవి అనే నౌకలు కూడా భారత్‌ చేరుకోనున్నాయి.

News March 16, 2026

ఫిల్మ్ ఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలు ఎక్కువ: MLA అనిరుధ్

image

TG: డ్రగ్స్ మూలాలు సినీ పరిశ్రమలోనే ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యాక్టర్లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయాలి. టెస్టుకు నిరాకరిస్తే విడుదలను ఆపేయాలి’ అని అన్నారు. ప్రజాప్రతినిధులూ 90 రోజులకోసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని, లేదంటే చట్ట సభలోకి అనుమతించొద్దని పేర్కొన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.