News February 10, 2025

SRPT: రేపు ముసాయిదా జాబితా విడుదల

image

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. SRPT జిల్లాలో 23 ZPTCలు, 232 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

Similar News

News November 6, 2025

నల్గొండ: సోదరిని చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా.. SRPT జిల్లా కేసారానికి చెందిన సువర్ణ రాజు (19), గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని చూడడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చిట్యాల దాటాక అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా బలమైన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 6, 2025

జీవితం సంతోషంగా మారాలంటే..?

image

రాగద్వేషాలను వదిలిపెట్టి, మన ఇంద్రియాలకు సాక్షిగా ఉన్న ఆ పరమాత్మను నిరంతరం ధ్యానించాలి. అలా మనం ఏకాగ్రతతో ఆయనపై భక్తి చూపి, ధ్యానం చేసినప్పుడు, ఈ దేహమే నేను అనే అహంకారం నశించిపోతుంది. దేహాభిమానం తొలగిపోతుంది. అప్పుడు సుఖదుఃఖాలు మనల్ని బాధించవు. ఇక బయటి ఆలోచనలు, కోరికలు పక్కన పెట్టాలి. మనసును పరమాత్మపై లగ్నం చేయాలి. ఫలితంగా నిజమైన శాంతి, ఆత్మనిర్భరత లభిస్తాయి. అప్పుడే జీవితం సంతోషమయం. <<-se>>#WhoIsGod<<>>

News November 6, 2025

B.R నాయుడిపై మండిపడ్డ భూమన

image

TTD ఛైర్మన్‌గా BR నాయుడు ఏడాది పాలన ఒక అసమర్థుడి జీవన యాత్రలాగా ఉందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా, సెటిల్‌మెంట్లు ఛైర్మన్ కార్యాలయం కేంద్రంగా నడుస్తున్నాయని ఆరోపించారు. AI టెక్నాలజీని ముందుగా ఛైర్మన్ మైండ్ సెట్‌ను మార్చడానికి ఉపయోగించాలని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన పాలనలో భక్తులకు ఒరిగిందేమి లేదని మండిపడ్డారు.