News February 10, 2025

వేయి స్తంభాల ఆలయానికి 862 ఏళ్లు

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. కాకతీయ శిల్పకళా శైలిలో రుద్ర దేవుడు ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆలయాన్ని నిర్మించి సుమారుగా 862 ఏళ్లు అవుతుంది. ఆలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ శిల్పకళా సంపదను తిలకిస్తుంటారు. మీరు వేయి స్తంభాల ఆలయానికి వెళితే కామెంట్ చేయండి.

Similar News

News September 17, 2025

పాకిస్థాన్‌తో మ్యాచ్.. యూఏఈ బౌలింగ్

image

ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఆడటంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. యూఏఈతో మ్యాచులో టాస్ కోసం ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సూపర్-4 చేరనుంది.

News September 17, 2025

నాయకులారా చూడండి.. ఇదీ ఆదిలాబాద్‌లో పరిస్థితి..!

image

నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజంటూ అన్ని పార్టీల నాయకులు, అధికారులు గొప్పగా ఉత్సవాలు చేసుకున్నారు. కానీ ప్రజా సమస్యలు మాత్రం ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్న దానికి ఈ ఘటనే నిదర్శనం. ఉట్నూర్(M) సుంగు మత్తడిగూడ వాసి కుమ్ర పారుబాయి(45) అనారోగ్యంతో చనిపోయింది. ఆ ఊరిలో బ్రిడ్జి లేక వాగులో ఒకరినొకరు పట్టుకుని ఈరోజు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.

News September 17, 2025

విశాఖ: పిల్లల ఉచిత శిక్షణా కార్యక్రమాలు పునఃప్రారంభం

image

VMRDA బాలల ప్రాంగణంలో పిల్లల కార్యక్ర మాలు సెప్టెంబర్ 21 నుంచి ప్రతి ఆదివారం పునఃప్రారంభమవుతాయని ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ బుధవారం వెల్లడించారు. విద్యార్థులకు ఇంగ్లీష్, పబ్లిక్ స్పీకింగ్, సంగీతం, డ్రాయింగ్, సైన్స్, కథా విన్యాసం, ఆర్ట్ & క్రాఫ్ట్, క్విజ్, AI కోడింగ్, కాలిగ్రఫీ, మ్యాథ్స్, నటన వర్క్‌షాప్, కెరీర్ గైడెన్స్ వంటి విభాగాలలో ఉచిత శిక్షణ అందిస్తారు.