News February 10, 2025
వేయి స్తంభాల ఆలయానికి 862 ఏళ్లు

హనుమకొండ జిల్లా కేంద్రంలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. కాకతీయ శిల్పకళా శైలిలో రుద్ర దేవుడు ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆలయాన్ని నిర్మించి సుమారుగా 862 ఏళ్లు అవుతుంది. ఆలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ శిల్పకళా సంపదను తిలకిస్తుంటారు. మీరు వేయి స్తంభాల ఆలయానికి వెళితే కామెంట్ చేయండి.
Similar News
News April 19, 2026
ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

పెద్దపల్లి జిల్లా ఓదెల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి బోనాలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలోని మదన పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. అటు ఎండ తీవ్రత భారీగా పెరగడంతో ఆలయ చుట్టూ తడకలు వేసి చల్లని వాతావరణాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
News April 19, 2026
జమ్మికుంట మార్కెట్ రేపు పున: ప్రారంభం

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ 3 రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం కానుంది. శుక్రవారం అమావాస్య సందర్భంగా సెలవు, నిన్న, నేడు సాధారణ సెలవులు కావడంతో మార్కెట్ మూసి ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను తీసుకొచ్చి సరసమైన ధరలు పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 9 గంటలలోపు మాత్రమే పత్తిని యార్డులోకి అధికారులు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.
News April 19, 2026
ఎన్టీఆర్: APCRDA అడిషనల్ కమిషనర్‌గా ధాత్రీ రెడ్డి.. నేపథ్యమిదే!

APCRDA అడిషనల్ కమిషనర్‌గా పెద్దిటి ధాత్రి రెడ్డిని నియమిస్తూ గత రాత్రి సిఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణ వాసి అయిన ఆమె 2020 IAS బ్యాచ్‌కు చెందినవారు కాగా ఏలూరు SP ప్రతాప్ శివకిశోర్(IPS)ను వివాహం చేసుకున్నారు. గతంలో పాడేరు సబ్ కలెక్టర్‌గా పనిచేసిన ధాత్రి రెడ్డి ప్రస్తుతం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) CEOగా పనిచేస్తున్నారు. తాజాగా APCRDA అడిషనల్ కమిషనర్‌గా నియమితులయ్యారు.


