News February 10, 2025

జగిత్యాల: తిమ్మాపూర్‌లో క్షుద్ర పూజల కలకలం!

image

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో స్థానిక తెలంగాణ విగ్రహం కూడలిలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్టు స్థానికులు తెలిపారు. పిల్లలు ఈ దారిగుండా రోజు పాఠశాలకు వెళ్తారు. ఈ చర్యను చూసి పిల్లలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయితీని కోరుతున్నారు.

Similar News

News March 24, 2026

నిర్మల్ : ‘వేసవిలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి’

image

వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని వివరించారు. వడదెబ్బన బారినపడిన ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలలోనే మెరుగైన చికిత్స అందించాలన్నారు.

News March 24, 2026

సిద్దిపేట: ‘క్షయ వ్యాధి నిర్మూలన మన అందరి బాధ్యత’

image

క్షయ వ్యాధి నిర్మూలన మన అందరి బాధ్యత అని సిద్దిపేట DMHO డాక్టర్ ధనరాజ్ అన్నారు. నాసర్ పుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిగా పాల్గొన్నారు. టీబి ముక్త్ భారత్ అభియాన్ సెకండ్ ఫేస్ కార్యక్రమంలో భాగంగా 100 రోజుల క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 96 సమస్య ఆత్మక గ్రామాలుగా గుర్తించినట్లు చెప్పారు.

News March 24, 2026

అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: CBN

image

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై నిగ్గు తేల్చాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు నిజంగా ప్రమాదాలా, లేక వాటి వెనుక కుట్ర కోణం ఉందా అనేది వెలికి తీయాలి. వరుస ఘటనలు, అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్ర ఉందనే అనుమానం వస్తోంది’ అని పేర్కొన్నారు. రాజధానిలో నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.