News February 10, 2025
యూసఫ్‌కు మంత్రి అభినందనలు

తన ప్రతిభతో అన్నమయ్య జిల్లాకు భారత షూటింగ్ బాల్ క్రీడాకారుడు మహమ్మద్ యూసుఫ్ మంచిపేరు తీసుకు వచ్చారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌ఛార్జ్ జయచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని రాయచోటిలో యూసఫ్ కలిశారు. శాలువా, పూలమాలలతో యూసఫ్‌ను సన్మానించారు. భవిష్యత్తులో భారత్‌కు మరిన్ని విజయాలను అందించాలని ఆకాంక్షించారు. యూసఫ్ వంటి క్రీడాకారులను తయారు చేయాలన్నారు.
Similar News
News September 18, 2025
నిర్మల్: నీరు నిలిస్తే.. నేల నవ్వుతుంది..!

భూమిపై ఉన్న జీవరాసుల మనుగడకు నీరు ఎంతో అవసరం. నీటిని నిర్లక్ష్యం చేస్తే భూమి నిర్జీవ గ్రహంగా మారుతుంది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ వర్షాకాలంలో దిలావర్పూర్ మండలంలోని చెరువులు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. వర్షపు నీటిని వృథా చేయకుండా సాగునీటి అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు.
#నేడు నీటి పర్యవేక్షణ దినోత్సవం.
News September 18, 2025
పల్నాడులో బార్లకు రాని దరఖాస్తులు

పల్నాడు జిల్లాలో బార్ లైసెన్స్‌ల కోసం వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు లైసెన్స్‌ల కోసం ఎంత మొత్తం అయినా చెల్లించడానికి సిద్ధపడిన వ్యాపారులు, కొత్త మద్యం పాలసీ కారణంగా ఆసక్తి చూపడం లేదు. ఎక్సైజ్ అధికారులు రెండుసార్లు నోటిఫికేషన్ విడుదల చేసినా సరైన స్పందన రాలేదు. జిల్లాలో మిగిలిన 30 బార్లలో కేవలం 8 బార్లకు మాత్రమే 32 దరఖాస్తులు వచ్చాయి.
News September 18, 2025
వరంగల్: ఈత కల్లు సీజన్ షురూ..!

ఓరుగల్లు జిల్లాలో తాటికల్లుకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం తాటికల్లు సీజన్ పూర్తై, ఈతకల్లు సీజన్ మొదలవుతోంది. గౌడన్నలు ఈదులను గీయడంతో కల్లు పారడం మొదలైంది. దసరా నాటికి పూర్తి స్థాయిలో కల్లు అందుబాటులోకి వస్తుంది. ఉమ్మడి జిల్లాలోని గోపనపల్లి, కల్లెడ, గట్టికల్, పాలకుర్తి, పాకాల, మడిపల్లి, కంఠాత్మకూర్, శాయంపేట, ఆత్మకూర్, బ్రాహ్మణపల్లి, వల్మిడి, తాల్లపూపల్లి వంటివి కల్లుకు ఫేమస్ ప్లేసులు.