News February 10, 2025

నిజాంసాగర్: కాలువలో వ్యక్తి గల్లంతు.. మృతదేహం లభ్యం

image

నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో పడి గల్లంతైన కర్రె విఠల్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మహమ్మద్ నగర్ మండలం బుర్గుల్ గ్రామ శివారులో నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటర్ 3 వద్ద సోమవారం మృత దేహాన్ని వెలికితీసినట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 18, 2026

రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

image

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.

News April 18, 2026

భద్రాద్రిలో వైభవంగా నిత్య కళ్యాణం..!

image

భద్రాద్రి క్షేత్రంలో సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక శనివారం కన్నుల పండువగా సాగింది. వేకువజామునే స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, అనంతరం బేడా మండపంలో సీతమ్మవారికి, రామయ్యకు శాస్త్రోక్తంగా పరిణయ మహోత్సవాన్ని జరిపించారు. వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య సాగిన ఈ వేడుకను పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించి తరించారు.

News April 18, 2026

భువనగిరి: రోడ్డు ప్రమాదంలో ఉపసర్పంచ్ మృతి

image

బొమ్మలరామవరం మండలం తుంకుంట ఉప సర్పంచ్ మేకల బాలకృష్ణ ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గ్రామ అభివృద్ధిలో చురుగ్గా ఉంటూ, నిరంతరం ప్రజా సేవ చేసే యువ నాయకుడి అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ కష్టసుఖాల్లో తోడుండే మంచి వ్యక్తిని కోల్పోయామని గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.