News February 10, 2025
ఆసిఫాబాద్: 3 మండలాలకు నూతన ఎంపీడీవోలు

ఆసిఫాబాద్ జిల్లాలోని 3 మండలాలకు నూతన ఎంపీడీవోలను నియమిస్తూ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఉత్తర్వులు జారీ చేశారు. బెజ్జూర్- ప్రవీణ్ కుమార్, లింగాపూర్- రామచందర్, వాంకిడి- సుధాకర్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఎంపీవోలుగా పనిచేస్తున్న వారిని ఎంపీడీవోలుగా నియమించినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 11, 2026
రామగుండం చేరుకున్న DCM భట్టి, మంత్రులు

గోదావరిఖనిలో జరిగే బహిరంగ సభకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాల్ చేరుకున్నారు. రామగుండం కార్పొరేషన్‌లో రూ.175 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, NTPC- ED చందన్ కుమార్ సమంతా, INTUC నేత జనక్ ప్రసాద్ పాల్గొన్నారు.
News January 11, 2026
₹1లక్ష జీతంతో 764 జాబ్స్.. ఇవాళే చివరి తేదీ

DRDO 764 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నిషియన్-A పోస్టుల భర్తీ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు ఈ అర్ధరాత్రితో (11 JAN-26) ముగుస్తోంది. A పోస్టులకు SSC+ITI, కేటగిరీ Bకి BSc లేదా 3సం. డిప్లొమా విద్యార్హత. నెలకు ₹1లక్ష వరకు వేతనంతో పాటు HRA, TA, పిల్లల ఎడ్యుకేషన్, మెడికల్ తదితర బెనిఫిట్స్ ఉంటాయి. 18-28సం. మధ్య వయస్కులు అర్హులు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం DRDO అధికారిక సైట్ చూడండి.
Share It
News January 11, 2026
మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యం: మంత్రి తుమ్మల

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం మంత్రి స్వగృహంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికలకు పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించారు


