News February 10, 2025
సిద్దిపేట: రేపు ముసాయిదా జాబితా విడుదల

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 26 ZPTCలు, 230 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు.
Similar News
News March 20, 2026
2014 నుంచి 6వేల ఫోన్లు ట్యాప్: రేవంత్

TG: BRS ప్రభుత్వ హయాంలో 6వేల ఫోన్లను ట్యాప్ చేయించారని CM రేవంత్ వెల్లడించారు. ‘ట్యాపింగ్ కేసులో చట్టప్రకారం ముందుకెళ్తున్నాం. విచారణ పూర్తికాకుండా అరెస్టులు చేయలేం. పంజాగుట్ట PSలోని కేసులో హరీశ్‌కు ఊరట వస్తే మొత్తానికి క్లీన్‌చిట్ వచ్చినట్లు BRS ప్రచారం చేస్తోంది. 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికే IAS అరవింద్ కుమార్‌ను సస్పెండ్ చేశాం’ అని రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.
News March 20, 2026
‘ఆస్కార్’ స్థాయికి చేరడమే నా లక్ష్యం: తమన్

తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ స్థాయికి చేరుకుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. మన చిత్రాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు. రాబోయే రోజుల్లో తాను చేసే సినిమాలతో ఆస్కార్ స్థాయికి చేరుకోవడమే లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మన మట్టి వాసన ఉన్న సంగీతాన్ని ట్రెండ్స్‌కు అనుగుణంగా అందిస్తే ఆస్కార్ సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఇక ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌తో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని చెప్పారు.
News March 20, 2026
తక్కెళ్లపాడు: నాగులేరు వాగులో పడి బాలుడు మృతి

వాగులో ప్రమాదవశాత్తూ బాలుడు మునిగి మృతి చెందిన ఘటన దాచేపల్లి మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు..తక్కెళ్లపాడుకు చెందిన రామసైదులు(16) గ్రామానికి సమీపంలోని నాగులేరు వాగు వద్ద ఆడుకుంటూ కాలుజారి పడి ఊపిరాడక ప్రాణాలను వదిలాడు. మృతదేహాన్ని గ్రామస్థులు బయటకు తీయగా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


