News February 10, 2025
MDK: రేపు ముసాయిదా జాబితా విడుదల

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. MDK జిల్లాలో 21 ZPTCలు, 190 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు.
Similar News
News December 25, 2025
మెదక్ చర్చిలో బందోబస్తు పరిశీలించిన ఎస్పీ

ప్రసిద్ధ మెదక్ చర్చి వద్ద క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తును ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు పరిశీలించారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు చర్చ్‌కు తరలివస్తున్నందున శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా భక్తులు చర్చి సందర్శించి వెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
News December 25, 2025
వర్గపోరుపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు

సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో గ్రూపుల గోలను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వర్గపోరు కాంగ్రెస్‌కు నష్టం, బీఆర్ఎస్‌కు లాభమని హెచ్చరించారు. హరీష్ రావు పదేళ్ల మంత్రిగా ఉండి నిధులన్నీ సిద్దిపేటకు ఇచ్చారని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి వివేక్ చెప్పారు.
News December 24, 2025
MDK: క్రిస్మస్‌ను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి: కలెక్టర్

యేసుక్రీస్తు జన్మదినోత్సవమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, క్షమ, త్యాగం, శాంతియుత సహజీవనం వంటి విలువలను యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించారని పేర్కొన్నారు. ఈ సందేశాన్ని ఆచరణలో పెట్టాలని కోరుతూ జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.


