News February 10, 2025
జగిత్యాల: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 20 ZPTCలు, 216 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.
Similar News
News March 18, 2026
విశాఖ: గమనిక.. ఇవాళ వందే భారత్ టైమింగ్‌లో మార్పు

విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20830) బుధవారం రీషెడ్యూల్ అయింది. మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, అనుసంధాన రైలు ఆలస్యం కారణంగా సాయంత్రం 6:20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్పు వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసింది.
News March 18, 2026
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎవరికి వర్తిస్తుందంటే?

రాష్ట్రమంతటా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు DPTO శ్రీనివాస రావు బుధవారం తెలిపారు. జిల్లాలోని అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం డిపోల నుంచి ఈ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. 40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News March 18, 2026
Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.


