News February 10, 2025

YCPలోకి నగరి MLA సోదరుడు..?

image

నగరి MLA గాలి భానుప్రకాశ్ సోదరుడు జగదీశ్ YCPలో చేరుతారని సమాచారం. ఆయన తండ్రి ముద్దుకృష్ణమ నాయుడు 2019లో మృతిచెందారు. రాజకీయ వారసుడి విషయంలో అప్పట్లో సందిగ్ధం నెలకొంది. దీంతో చంద్రబాబు ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతికి MLC ఇచ్చారు. 2019, 24లో భాను ప్రకాశ్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి జగదీశ్ తటస్థంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఈనెల 12న ఫ్యాన్ గూటికి చేరుతారని సమాచారం.

Similar News

News March 17, 2026

TU: 603 మంది ఉద్యోగాలకు ఎంపిక

image

టీయూలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ ఫెయిర్‌లో 603 మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ అందజేసినట్లు ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డా.పాత నాగరాజు తెలిపారు. ఆన్‌లైన్‌లో 1,470 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 1,255 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అందులో 603 మంది మొదటి దశలో ఎంపిక కాగా మరో 25 మంది 2వ దశకు ఎంపికైనట్లు చెప్పారు. 90% అమ్మాయిలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారన్నారు.

News March 17, 2026

మహిళా యాక్టర్లు పబ్లిక్ ప్రాపర్టీలు కాదు: ఖుష్బూ

image

అనవసర చర్చల్లోకి మహిళా యాక్టర్లను లాగుతున్నారని BJP నేత, నటి ఖుష్బూ సుందర్ ఫైరయ్యారు. ‘ఇతరులను విమర్శించేందుకు ఓ మహిళ ఐడెంటిటీని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి మగాడు జన్మించేది స్త్రీకే. మీ ఇంట్లో మహిళల గురించి ఇలాగే మాట్లాడతారా? మహిళా యాక్టర్లు పబ్లిక్ ఫిగర్లు కావచ్చేమో కానీ పబ్లిక్ ప్రాపర్టీలు కాదు’ అని అన్నారు. <<19407702>>నయనతారపై MP వ్యాఖ్యలు<<>>, విజయ్-త్రిష వ్యవహారంపై ఆమె ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.

News March 17, 2026

వనపర్తి: సీఎంఆర్‌ రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్‌

image

రైస్ మిల్లర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం రికవరీని క్రమం తప్పకుండా చేపట్టాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో జిల్లాలో గ్యాస్ సిలిండర్ సరఫరా పెండింగ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ రికవరీ అంశాలపై పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సమయానుకూలంగా బియ్యం వసూలు చేయాలని సూచించారు.