News March 20, 2024

తీహార్ జైల్లో మొబైల్ జామర్లు

image

తీహార్ జైల్లో ఖైదీలు ఫోన్‌లు ఉపయోగించడాన్ని అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. రూ.11.5 కోట్ల వ్యయంతో జైలులో 15 సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాల్ బ్లాకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7కి.మీ దూరంలో తీహార్ గ్రామంలో ఉన్న ఈ జైలు ఆసియాలో అతిపెద్దది. గత కొన్నేళ్లలో ఇక్కడ నుంచి గ్యాంగ్‌స్టర్లు ఫోన్లు వాడటం, బయటి వారిని బెదిరించడం వంటి ఘటనలు వెలుగు చూశాయి.

Similar News

News July 5, 2024

‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఆగస్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 14న ప్రీమియర్స్ వేయనున్నట్లు సమాచారం. దీనిపై మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

News July 5, 2024

BREAKING: ‘నీట్’ రద్దు చేయలేం: కేంద్రం

image

నీట్ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లకు సమాధానంగా అఫిడవిట్ వేసింది. ‘పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే నిజాయితీగా ఎగ్జామ్ రాసిన లక్షలాది మంది విద్యార్థులకు నష్టం కలుగుతుంది. పారదర్శకంగా పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నాం. నీట్ లీకేజీలో నిందితులను అరెస్ట్ చేశాం. CBI దర్యాప్తునకు ఆదేశించాం’ అని పేర్కొంది.

News July 5, 2024

BREAKING: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి

image

TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ వికాస్‌రాజ్‌ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.