News February 10, 2025
శ్రీకాకుళంలో పెరుగుతున్న Water Melon విక్రయాలు
శ్రీకాకుళం జిల్లాలో వేసవి ప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి నుండే వేసవిని తలపించే విధంగా భానుడు ప్రభావం చూపుతుండటంతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లాలో వాటర్ మిలాన్, పండ్లు, జ్యూస్ షాపుల్లో విక్రయాలు పెరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, సోంపేట తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వాటర్ మిలాన్ విక్రయాలు జోరందుకున్నాయి. కాగా ఈ ఏడాది వేసవి ప్రభావం ముందుగానే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.
Similar News
News February 11, 2025
విశాఖ: రోడ్డుప్రమాదంలో యువతి మృతి
విశాఖలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందింది. శ్రీకాకుళం(D) ఇచ్ఛాపురానికి చెందిన ఉషారాణి(22) స్నేహితుడు సిద్దూతో కలిసి ఓ ఫార్మా కంపెనీలో ఇంటెర్న్ చేసేది. ఉషారాణికి కొరియర్ రాగా సిద్దూతో కలిసి బైక్‌పై ఆటోనగర్ వెళ్లింది. తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీట్టడంతో ఆమె కింద పడింది. ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు గాజువాక ట్రాఫిక్ CI కోటేశ్వరరావు తెలిపారు.
News February 11, 2025
సోంపేట: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దాటిన వేళ ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షావుకారి డిల్లేశ్వరరావు (75) మద్యం మత్తులో తన భార్య రత్నాలు(70)పై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. మృతురాలికి ఇద్దరు కుమారులు, అందులో ఒకరు మృతి చెందగా మరో కుమారుడు టీ దుకాణం నడిపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్సై లవరాజు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 10, 2025
టెక్కలి: లారీ డ్రైవర్‌కు INCOME TAX నోటీసు
టెక్కలి మండలం చల్లపేట గ్రామానికి చెందిన చల్లా నాగేశ్వరరావుకు రూ.1,32,99,630 కోట్లు ఆదాయ పన్ను కట్టాలని నోటీసులు వచ్చినట్లు బాధితుడు వాపోయారు. తనకు ఏడాదికి సుమారు రూ.3.97కోట్లు ఆదాయం వస్తున్నట్లు పేర్కొంటూ నోటీసు వచ్చిందన్నారు. ఈ మేరకు ఆదివారం బాధితుడి న్యాయం చేయాలని టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు, తన సోదరుడికి ఆస్తి గొడవలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.