News February 10, 2025
సుల్తానాబాద్: రైలు ఢీకొని వ్యక్తి మృతి

సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతిచెందాడు. మృతదేహం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రామగుండం మార్చురీలో ఉందని ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి.తిరుపతి తెలిపారు. వివరాలు తెలిస్తే 9949304574, 8712658604 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
Similar News
News March 15, 2026
నంద్యాల జిల్లాలో విజయవంతంగా ‘అక్షరాంధ్ర’ పరీక్షలు

అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలో 1,024 పరీక్షా కేంద్రాలలో 1,00,993 మంది పరీక్షలు రాసినట్లు వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. “అక్షరాంధ్ర” ఫైనల్ పరీక్ష విజయవంతంగా జరిగిందన్నారు. లక్ష మందికి పైగా హాజరవడం అభ్యాసకులలో ఉన్న ఆసక్తికి నిదర్శనమన్నారు. అక్షరాస్యత శాతం పెంపుకు ప్రతిబింబమని, అందరి సహకారంతో విజయవంతంగా జరిగిందన్నారు.
News March 15, 2026
బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలి: మాజీ మంత్రి

హైదరాబాద్ లక్డికపూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో నిర్వహించిన బీసీ సంఘాలు- ప్రజాప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.
News March 15, 2026
తమిళనాడు ఎన్నికలు.. ఫ్రంట్ రన్నర్‌గా DMK?

<<19389988>>TN ఎన్నికల్లో<<>> AIADMK నేతృత్వంలోని NDA, DMK, TVK పార్టీల మధ్య పోరు నెలకొంది. 234 స్థానాల్లో 2021లో 159సీట్లతో అధికారంలోకి వచ్చిన DMKకు వెల్ఫేర్ స్కీమ్‌లు, ద్రవిడియన్ మోడల్ గవర్నెన్స్ బలం. ఇక పళనిస్వామి AIADMKను నడిపిస్తున్నా జయలలిత లేని లోటును పూడ్చుకునే పనిలోనే ఉన్నట్లు విశ్లేషకుల మాట. అటు TVK యూత్, మైనార్టీ ఓట్లను చీల్చే ఛాన్స్ ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా DMKకు కలిసొస్తుందని అంటున్నారు.


