News February 10, 2025
ఎల్లుండి నుంచి పవన్ ఆధ్యాత్మిక యాత్ర

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఈ నెల 12 నుంచి 14 వరకు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. అనంతపద్మనాభస్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలను ఆయన సందర్శించనున్నారు.
Similar News
News March 7, 2026
రేపు వరుణ్ ఆడతాడా? సూర్య రెస్పాన్స్ ఇదే..

T20 WC: టీమ్‌ఇండియా స్టార్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. దీంతో ఫైనల్లో అతణ్ని తప్పిస్తారనే చర్చ జరుగుతోంది. దీనిపై కెప్టెన్ సూర్య స్పందించారు. ‘వరుణ్ ఫామ్‌పై మాకు ఆందోళన లేదు. ఇది టీమ్ స్పోర్ట్. అతని ఒక్కడి పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించడం లేదు. అతడు వరల్డ్ నం.1 బౌలర్. టీమ్‌ను ఎలా గెలిపించాలో అతనికి తెలుసు’ అంటూ వరుణ్‌ను వెనకేసుకొచ్చారు. జట్టులో మార్పులు రేపే తెలుస్తాయన్నారు.
News March 7, 2026
‘సిగ్గుచేటు’.. బెంగాల్ ప్రభుత్వంపై మోదీ ఫైర్

బెంగాల్‌లోని TMC ప్రభుత్వంపై PM మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రపతి <<19322594>>ద్రౌపదీ ముర్ము<<>>ను అవమానించేలా బెంగాల్ యంత్రాంగం వ్యవహరించడం సిగ్గుచేటని, ఇది ప్రజాస్వామ్యానికే విఘాతమని విమర్శించారు. సంతాల్ సంస్కృతిని TMC ప్రభుత్వం చాలా చులకనగా చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రపతి కార్యాలయం రాజకీయాలకు అతీతమని, ఆ పదవికి ఉన్న పవిత్రతను గౌరవించాలని హితవు పలికారు.
News March 7, 2026
నాలుగుసార్లు ప్రధాని.. చిత్తుగా ఓడిపోయారు

నేపాల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఆ దేశానికి నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ(CPN-UML) సొంత నియోజకవర్గం జాఫా-5లో చిత్తుగా ఓడిపోయారు. ఆయనపై RSP అభ్యర్థి బాలేంద్ర షా 49,164 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఓవరాల్‌గా 165 స్థానాలకుగాను RSP 67 చోట్ల గెలిచింది. 55 సెగ్మెంట్లలో లీడింగ్‌లో ఉంది. మిగతా పార్టీలన్నీ సింగిల్ డిజిట్‌తో పోటీ పడుతున్నాయి.


