News February 10, 2025

త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం: పరశురాం

image

త్వరలో దిల్ రాజు నిర్మాతగా సినిమా షూటింగ్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రముఖ డైరెక్టర్ పరశురాం వెల్లడించారు. సోమవారం అనకాపల్లి జిల్లా జల్లూరులో పర్యటించిన ఆయన పలు విషయాలు పంచుకున్నారు. సినిమా షూటింగ్‌కు అవసరమైన స్క్రిప్ట్ పూర్తయిందన్నారు. తను ఇప్పటివరకు ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 7, 2026

ఈనెల 13 లోగా అభ్యంతరాలు తెలపాలి: లింగేశ్వర్ రెడ్డి

image

జోన్-III పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని స్కూల్ అసిస్టెంట్ గేడ్-II ప్రధానోపాధ్యాయ పోస్టులకు, తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేశారు. వివరాలను వెబ్ సైట్‌లో అందుబాటులో
ఉంచినట్లు ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత డీఈవో కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈనెల 13వ తేదీలోగా అందజేయాలని సూచించారు.

News March 7, 2026

MHBD: అక్రమ ఇసుక రవాణా సమన్వయంతో అరికట్టాలి: కలెక్టర్

image

అక్రమ ఇసుక రవాణాను అన్ని శాఖలు సమన్వయంతో అరికట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. ఇసుక అక్రమ రవాణా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇసుక సరఫరా తదితర అంశాలపై రెవెన్యూ, పోలీస్, మైనింగ్, పంచాయతీరాజ్ శాఖలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇసుక సరఫరా చేయాలన్నారు. ఇసుక రవాణాలో నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటమన్నారు.

News March 7, 2026

MHBD: సమాజ అభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర: అదనపు కలెక్టర్

image

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మహబూబాబాద్ TGO జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ సమాజంలో ముందంజలో నిలుస్తున్నారని టీజీవో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండీ రఫీ అన్నారు.