News February 10, 2025
వరంగల్: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో పంచాయతీ రాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. ఇంటి నిర్మాణం కోసం వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా సమాచారంతో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2026
శ్రీధర్ బాబు స్థానంలో ఉత్తమ్!

శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టే బాధ్యతను మంత్రి శ్రీధర్ బాబు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. గతంలో ఆయనే మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టే బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. అయితే, తనకు వెన్నునొప్పి ఉన్నందున బాధ్యత తీసుకోలేకపోయానని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అధిష్టానంపై శ్రీధర్ బాబు చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగానే ఈ మార్పు జరిగిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
News March 22, 2026
PPPలది సక్సెస్ ఫార్ములా: చంద్రబాబు

AP: దేశంలో పీపీపీ విధానంలో చేపట్టిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు, ఎయిర్ పోర్టులు విజయవంతం అయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటం, ఏఐ, డ్రోన్స్ లాంటి భవిష్యత్ టెక్నాలజీలతో రాష్ట్రంలో సుపరిపాలన అందించేలా ప్రణాళికలు రచిస్తున్నామని HYD ISBలో తెలిపారు. వివిధ దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోందని.. భారత్‌లో ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
News March 22, 2026
నంద్యాల: ఈనంబర్‌కి కాల్ చేసి CMDకి ఫిర్యాదు చేయొచ్చు..!

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ‘డయల్ యువర్ CMD’ని APSPDCL నిర్వహించనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 89777 16661కు కాల్ చేసి తమ సమస్యలను CMDకి తెలియజేయవచ్చని అధికారులు సూచించారు. కాల్ చేసే సమయంలో విద్యుత్ సర్వీస్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.


