News February 10, 2025
ముత్తంగి అలంకారంలో భద్రాద్రి రామయ్య

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో సోమవారం రామయ్యకు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం సందర్భంగా స్వామి వారు ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాత సేవ అనంతరం విశ్వక్సేన ఆరాధన, కర్మఃపుణ్యాహవాచన చేసి స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ యోక్త్రధారణ తదితర కార్యక్రమాలతో రామయ్యకు నిత్యకళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు,భక్తులు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
ఆదిలాబాద్: ఉచితంగా వెజిటబుల్ కిట్ల పంపిణీ

వెజిటబుల్ మినీ కిట్లను గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఉద్యాన శాఖ ద్వారా రైతులకు ఉచితంగా అందిస్తున్న కిట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సహించడానికే ఉచిత కిట్లను అందిస్తున్నామన్నారు.
News March 13, 2026
సిరిసిల్ల: పదవ తరగతి పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు

ఈనెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షాలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 7,317 మంది విద్యార్థుల కోసం 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు.
News March 13, 2026
HYD అభివృద్ధి@2050.. కీలక ప్రతిపాదనలు

HYD మెట్రోపాలిటన్ ప్రాంతం కోసం సమగ్ర మొబిలిటీ ప్రణాళిక వర్క్‌షాప్‌లో ఉన్నతాధికారులు కీలక ప్రతిపాదనలు చేశారు. 2050 వరకు మౌలిక సదుపాయాల ప్రణాళిక కోసం బ్లూ, గ్రీన్ మాస్టర్ ప్లాన్‌కు ప్రతిపాదించారు. మెట్రో నెట్‌వర్క్ పెంపు, రోడ్లు, హైవేలు, ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ కారిడార్లు, 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు/స్కైవాక్‌లు, 34 ROBలు, 16 RUBలు, 8 ఎలివేటెడ్ రోడ్లు, మూసీ నదిపై 29 వంతెనల కోసం ప్రతిపాదించారు.


